Page Loader
Jeff Bezos: ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన జెఫ్ బెజోస్‌.. వెనిస్‌లో వేడుక!
ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన జెఫ్ బెజోస్‌.. వెనిస్‌లో వేడుక!

Jeff Bezos: ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన జెఫ్ బెజోస్‌.. వెనిస్‌లో వేడుక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు, 55 ఏళ్ల లారెన్‌ శాంచెజ్‌ (Lauren Sanchez)ను వివాహం చేసుకున్నారు. ఇటలీకి చెందిన ప్రకృతి సోయగాలతో నిండిన వెనిస్‌ (Venice) నగరంలోని లాగూన్‌ ఐలాండ్‌లో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, జోర్దాన్‌ రాణి, పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ వేడుక కోసం లారెన్‌ శాంచెజ్ ఏకంగా 27 ప్రత్యేక ఔట్‌ఫిట్‌లను సిద్ధం చేసినట్లు సమాచారం.

Details

25 ఏళ్ల వివాహ జీవితానికి 2019లో ముగింపు

వాటి విలువ లక్షల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి పెళ్లితో వెనిస్‌ నగరం ప్రముఖుల రాకతో కాంతిమయంగా మారింది. లారెన్‌ శాంచెజ్‌ గతంలో బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. జెఫ్‌ బెజోస్‌తో ఆమె 2018 నుంచి ప్రేమలో ఉన్నారు. బెజోస్‌ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్‌ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వివాహ జీవితానికి 2019లో ముగింపు పలికారు. అనంతరం లారెన్‌తో బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని వెల్లడించారు. 2023లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్‌ చేసుకున్నారు.

Details

కానుకగా విలువైన బహుమతులు

ఆ సందర్భంలో బెజోస్‌ లారెన్‌కు 2.5 మిలియన్‌ డాలర్ల విలువైన (భారత కరెన్సీలో సుమారు రూ.21 కోట్లు) ఎంగేజ్మెంట్‌ రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. అంతేగాక, లారెన్‌ కోసం ఖరీదైన విలాసవంతమైన గృహాన్ని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఇండియన్‌ క్రీక్‌ (Indian Creek) ఐలాండ్‌లో రూ.560 కోట్ల (68 మిలియన్‌ డాలర్లు) విలువైన మూడు బెడ్‌రూమ్‌ల మాన్షన్‌ను బెజోస్‌ కొనుగోలు చేశారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.