
Joe Biden : గాజా పౌరుల ప్రాణాలను రక్షించాలి.. కానీ హమాస్'పై యుద్ధం ఆగిపోకూడదు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మూడో నెలలోకి ప్రవేశించింది. ఇప్పటికే దీని కారణంగా పదివేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
పాలస్తీనియన్లు గాజాలో ఎక్కడా సురక్షితంగా ఉన్నట్లు భావించడం లేదని, రోజుల తరబడి భారీ పోరు సాగుతున్న క్రమంలో తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలంటేనే భయపడుతున్నామని చెప్పారు.
ఇదే సమయంలో గాజాలో తీవ్రస్థాయి పోరాటాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరింది.
ప్రజల మరణాలపై ఇజ్రాయెల్'పై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా నుంచి పలు సూచనలు అందుతున్నాయి.
ఇటీవలే ఇజ్రాయెల్ దాడుల్లో 12 మంది పాలస్తీనియన్లు మరణించినా పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులను పట్టుకోవడంలో సహాయపడిందని ఐడీఎఫ్ వెల్లడించింది.
details
ఇజ్రాయెల్ మరింత జాగ్రత్తగా ఉండాలి : బైడెన్
ఇటీవలే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ స్థావరాలను విస్తరించింది.హమాస్ నియంత్రణలో ఉన్న భూభాగంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం,యుద్ధం కారణంగా దాదాపుగా 18,400 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి సుమారు 1,200 మందిని చంపి 240 మందిని బందీలుగా పట్టుకుంది. అనంతరం తమపై జరిగిన భూదాడిలో 113 మంది సైనికులు మరణించారని idf పేర్కొంది.
ఇదే సమయంలో గాజాలోని పౌరులకు రక్షణకు ఇజ్రాయెల్ మరింత శ్రద్ధ వహించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సూచించారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆపకూడదని అమెరికా కోరుకుంటోందని ఆయన అన్నారు. వాషింగ్టన్'లోని ఓ వైద్య పరిశోధనా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన బైడెన్, ఇజ్రాయెల్ మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హమాస్'పై యుద్ధం ఆగిపోకూడదు
Reporter: “Do you want Israel to scale back its assault on Gaza? By the end of the year, do you want them to tone it down, move to a lower-intensity phase?”
— The Recount (@therecount) December 14, 2023
Biden: “I want them to be focused on how to save civilian lives; not stop going after Hamas, but be more careful.” pic.twitter.com/bEJmFWyehs