America: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న అధ్యక్షుడు.. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆదివారం అర్థరాత్రి ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఈ లేఖలో, ఆయన తన పదవీకాలం, ఈ కాలంలో చేసిన విశేష కృషిని ప్రస్తావించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పారు. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన బైడెన్ ఆమెకు మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు
డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హారిస్ వైపే మొగ్గు
'ఈ రోజు తన పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించలి' అని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హారిస్(59)వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేనందున ఆమే సురక్షిత అభ్యర్థి అవుతారనేది వారి అంచనా. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్జ్‌కెర్ బరిలో నిలిచే అవకాశముంది.