
Ukraine war: ఉక్రెయిన్ కోసం 725 మిలియన్ డాలర్ల ఆయుధ సహాయ ప్యాకేజీ సిద్ధం.. బైడెన్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం (Russia-Ukraine Conflict) తీవ్ర ఉద్రిక్తతలను కలిగిస్తోంది.
ఈ క్రమంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలకమైన మరో నిర్ణయం తీసుకున్నారు.
కీవ్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.
ముఖ్యంగా, తన పదవీ కాలం ముగింపు దశలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు అక్కడి మీడియాకు తెలిపారు.
ఉక్రెయిన్ కోసం సుమారు 725 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాల ప్యాకేజీని సిద్ధం చేస్తోందని సమాచారం.
ఈ ప్యాకేజీలో ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ క్షిపణులు, అలాగే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ (HMARS) ఉన్నాయి.
వివరాలు
పెరిగిన ఆయుధాల వినియోగం
అంతేకాకుండా, క్లస్టర్ ఆయుధాలు కూడా అందించబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
జో బైడెన్ జనవరి నెలలో పదవీ విరమణ చేయనుండగా, ఉక్రెయిన్ బలపరచడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చర్యలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ అథారిటీ (PDA) ద్వారా ఆయుధాల వినియోగం ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.
అత్యవసర పరిస్థితుల్లో అమెరికా మిత్రదేశాలకు సాయం అందించేందుకు PDA ఆధారంగా ఆయుధాలను నిల్వ చేయడం జరుగుతుంది.
వివరాలు
ల్యాండ్ మైన్స్ స్వయంగా నిర్వీర్యం అయ్యే విధంగా డిజైన్
అదేవిధంగా, అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా ల్యాండ్ మైన్స్ తయారీని నిలిపివేసినట్లు ప్రకటించింది.
అయితే, ఉక్రెయిన్‌కు అందించబోయే మైన్స్ ఇప్పటికే నిల్వలో ఉన్నవే అని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
యుద్ధం ముగిసిన తర్వాత ల్యాండ్ మైన్స్ సరిగా తొలగించకపోతే సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని సూచించారు.
అయితే, తాజా ల్యాండ్ మైన్స్ స్వయంగా నిర్వీర్యం అయ్యే విధంగా డిజైన్ చేయబడ్డాయని తెలిపారు.
బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ మైన్స్ నాలుగు గంటల నుంచి రెండు వారాల వ్యవధి వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి.
ఆ తర్వాత, బ్యాటరీ కాలం ముగియడంతో అవి స్వయంగా నిర్వీర్యం అవుతాయని అధికారులు వెల్లడించారు.