LOADING...
USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు .. 
హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత..

USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, హార్వర్డ్‌లో విద్యనభ్యసించాలని ఆశించే విదేశీ విద్యార్థులకు సంబంధించిన వీసాలపై ట్రంప్ విధించిన ఆంక్షలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. ఆయన జారీ చేసిన ఆదేశాలను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా అమలు చేయవద్దంటూ నిలిపివేసింది. ట్రంప్ ఆదేశాలపై హార్వర్డ్ యూనివర్సిటీ న్యాయపరంగా అభ్యంతరం తెలపడంతో కోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం అధ్యక్షుడి ఉత్తర్వులను తాత్కాలికంగా అమలు చేయకుండా నిలిపివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడి ఆదేశాలు అమలులోకి వస్తే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి తీరని నష్టమని జడ్జి అల్లిసన్ బరోస్ వ్యాఖ్యానించారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

వివరాలు 

విదేశీ విద్యార్థుల ప్రవేశం జాతీయ భద్రతకు ముప్పు

ఇంతకుముందు కూడా ట్రంప్ తీసుకున్న, హార్వర్డ్‌ వంటి విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల చొరవను తగ్గించే నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ట్రంప్ మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసి, అమెరికాలో ఉన్న యూనివర్సిటీల్లో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలకు ఆంక్షలు విధించారు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న హార్వర్డ్ క్యాంపస్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశం జాతీయ భద్రతకు ముప్పుగా మారొచ్చని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.