
US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది.
2024 డెమొక్రటిక్ కన్వెన్షన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు.
ఇక త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమె డెమొక్రాట్ల అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
పార్టీ నామినీగా ఎన్నికావడం గౌరవంగా ఉందని, వచ్చే వారం నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తానని కమలా హారిస్ వెల్లడించారు.
Details
తొలి భారతీయ అమెరికన్ గా కమల చరిత్ర
దేశం మీద, ప్రజల కోసం ఇకపై ప్రచారం చేస్తానని కమలా హారిస్ పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా చరిత్రలో అభ్యర్థిత్వం సాధించిన తొలి శ్వేతజాతీయేతర మహిళాగా ఆమె రికార్డు సృష్టించారు.
అదే విధంగా తొలి భారతీయ అమెరికన్‌గా కమల చరిత్ర సృష్టించింది.
ఆగస్టు 22న షికాగోలో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమల తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తారు.