Page Loader
Kenya: కెన్యా స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి కాలిన గాయాలు
కెన్యా స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం

Kenya: కెన్యా స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి కాలిన గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2024
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెన్యాలోని నైరీ కౌంటీలో హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి పాఠశాలలోని వసతి గృహంలో మంటలు హఠాత్తుగా వ్యాపించాయి. ఈ విషాద ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

వివరాలు 

2017లో ఇదే తరహా ఘటన 

కెన్యా బోర్డింగ్ పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతుండటంతో ఇది పెద్ద సమస్యగా మారింది. విద్యార్థులు తమ చదువు లేదా జీవనశైలికి సంబంధించిన ఒత్తిడుల కారణంగా నిరసన వ్యక్తం చేయడం వల్ల ఈ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. 2017లో నైరోబీలో ఒక బోర్డింగ్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కూడా ఇదే తరహా ఘటనగా భావిస్తున్నారు.