LOADING...
Mojtaba Khamenei: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. కొత్త లీడర్‌గా మోజ్తబా
అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. కొత్త లీడర్‌గా మోజ్తబా

Mojtaba Khamenei: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. కొత్త లీడర్‌గా మోజ్తబా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైమానిక దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ(55)దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నుకోబడ్డారు. ఫిబ్రవరి 28న తేహ్రాన్‌లోని తన కార్యాలయంపై జరిగిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించింది. ఖమేనీ మరణవార్తతో దేశ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. దేశవ్యాప్తంగా 7 రోజుల ప్రభుత్వ సెలవు ప్రకటించడంతో పాటు, 40 రోజులపాటు జాతీయ సంతాప దినాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రధాన నగరాలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాల వద్ద అదనపు భద్రతా దళాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.

Details

ఎవరీ మోజ్తబా ఖమేనీ?

1969లో మషాద్ నగరంలో జన్మించిన మోజ్తబా ఖమేనీ చిన్ననాటి నుంచే మతపరమైన విద్యను అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో సేవలందించారు. దీంతో సైనిక, పారామిలిటరీ దళాలతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడింది. మోజ్తబా ఖమేనీ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభుత్వ పదవులు నిర్వహించలేదు. అయితే తన తండ్రికి అత్యంత సన్నిహిత సలహాదారుడిగా వ్యవహరిస్తూ, దేశ కీలక నిర్ణయాల్లో తెరవెనుక ప్రభావం చూపిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2009లో ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనల సమయంలో ఆయన పేరు అంతర్జాతీయంగా ప్రాధాన్యం పొందింది. ఆ నిరసనలను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి.

Details

ఇరాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ

1979 ఇస్లామిక్ విప్లవం ప్రధానంగా రాజవంశ పాలనకు వ్యతిరేకంగా సాగింది. అలాంటి నేపథ్యంలో తండ్రి తర్వాత కుమారుడే అత్యున్నత పదవిని చేపట్టడం ఇరాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది. కొందరు దీనిని విప్లవ ఆదర్శాలకు విరుద్ధమని అభిప్రాయపడుతుండగా, సైనిక వర్గాల మద్దతు మాత్రం మోజ్తబాకు బలంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త సుప్రీం లీడర్ నాయకత్వంలో ఇరాన్ ఏ దిశగా పయనిస్తుంది? అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు మోజ్తబా ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement