LOADING...
Nikhil Gupta: ఖలీస్థాన్ నేత హత్య కుట్రపై కీలక పరిణామం.. నేరం ఒప్పుకున్న నిఖిల్ గుప్తా!
ఖలీస్థాన్ నేత హత్య కుట్రపై కీలక పరిణామం.. నేరం ఒప్పుకున్న నిఖిల్ గుప్తా!

Nikhil Gupta: ఖలీస్థాన్ నేత హత్య కుట్రపై కీలక పరిణామం.. నేరం ఒప్పుకున్న నిఖిల్ గుప్తా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో విచారణ పూర్తయింది. ఈ కేసులో భారత పౌరుడు నిఖిల్ గుప్తా ను దోషిగా నిర్ధారించారు. శిక్షను 2026 మే 29న ప్రకటించనున్నారు. విచారణ సమయంలో మాన్‌హాటన్‌లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ ఎదుట గుప్తా నేరాన్ని అంగీకరించాడు. ఈ తీర్పు అమెరికా-భారత్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఖిల్ గుప్తా చేసిన ఒప్పుకోలను అమెరికా వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పన్నున్ హత్య కుట్ర అంశం గతంలో భారత్-అమెరికా సంబంధాలను దెబ్బతీసింది. అయితే ఇటీవలే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అప్పటి భారత భద్రతా అధికారిలో ఒకరి సూచనల మేరకు ఈ కుట్ర పన్నినట్లు వెల్లడైంది

Details

వికాస్ యాదవ్ ఫోటో రిలీజ్

. ఈ కేసులో గుప్తా చేసిన ఒప్పుకోలు కీలక మలుపుగా మారాయి. అందుకే అమెరికా తదుపరి చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోంది. అమెరికాలో వాంటెడ్ జాబితాలో ఉన్న వికాస్ యాదవ్‌ను 2023 డిసెంబర్ 18న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా వికాస్ యాదవ్ ఫోటోను విడుదల చేసింది. భారత రా (RAW) విభాగానికి చెందిన ఒక అధికారి ఆదేశాల మేరకు పన్నున్ హత్యకు ప్లాన్ రూపొందించారని అమెరికా ఆరోపిస్తోంది. ఈ హత్య కోసం మొత్తం 1 లక్ష డాలర్ల సుఫారీ నిర్ణయించగా, అందులో 15 వేల డాలర్లు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో శిక్షను 2026 మే 29న వెల్లడించనున్నారు.

Advertisement