Page Loader
ISREAL-HAMAS WAR : కస్సామ్ బ్రిగేడ్స్ అంటే ఎవరో తెలుసా
కస్సామ్ బ్రిగేడ్స్ అంటే ఎవరో తెలుసా

ISREAL-HAMAS WAR : కస్సామ్ బ్రిగేడ్స్ అంటే ఎవరో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 26, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత 20 రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతోంది. ఈ మేరకు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) గాజా నగరంపై మరణ శాసనాన్ని లిఖిస్తోంది. పాలస్తీనా అధీనంలో ఉన్న ఈ నగరంలో హమాస్ మిలిటెంట్లు దాక్కున్నారని, ఈ మేరకు ఇజ్రాయెల్ తన బలగాలతో, ఆయుధాలతో గాజాను జల్లెడ పడుతోంది. కస్సామ్‌ బ్రిగేడ్స్‌ హమాస్‌ మిలిటరీ విభాగమే ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌. ఓ పక్క ఇజ్రాయెల్ గాజాపై భూదాడికి సర్వం సిద్ధమై ఉంది. మరోపక్క ఐడీఎఫ్ బలగాలు ఎదుర్కోనున్న ప్రాథమిక సాయుధ సమూహాలే ఈ కస్సామ్ బ్రిగేడ్స్. 1980, 1990ల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హమాస్ యోధుల మిలిటెంట్ చర్యలను కేంద్రీకరించేందుకు 1992లో హమాస్ తన సైనిక విభాగాన్ని స్థాపించింది.

details

కస్సామ్‌కు మెరుగైన పేలుడు పరికరాలు,రాకెట్ లాంచర్‌లున్నాయి

సిరియన్ పోరాట యోధుడు ఎజ్జెడిన్ అల్-కస్సామ్ నుంచి ఈ పేరు ఆవిర్భవించింది. అతను పాలస్తీనాకు బహిష్కరించబడిన తర్వాత బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మహమ్మద్ దీఫ్ దీనికి సైనిక కమాండర్ గా వ్యవహరించగా, డిప్యూటీగా మార్వాన్ ఇస్సా సహాయం కొనసాగాడు. ఇజ్రాయెల్‌పై కస్సామ్ బ్రిగేడ్‌ల చర్యలు పాలస్తీనియన్లలో భారీగా ప్రజాదరణ తెచ్చిపెట్టాయి.ఇజ్రాయెల్ రాజకీయంగా బలపడటంతో కస్సామ్ బ్రిగేడ్ మరింత బలహీనపడింది. కస్సామ్ బ్రిగేడ్ సహా ఇతర పాలస్తీనా సాయుధ బలగాలు 2021లో ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో 4,400 కంటే ఎక్కువ రాకెట్‌లను ప్రయోగించాయి.ఈ మేరకు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ 2021 నివేదించింది. కస్సామ్‌కు మెరుగైన పేలుడు పరికరాలు (IEDలు),రాకెట్ లాంచర్‌లు, ట్యాంక్ వ్యతిరేక క్షిపణులు,మోర్టార్‌లలో నైపుణ్యం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.