Kuwait Airport: కువైట్ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు మృతి, 63 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో మరో భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల్లో ఓ భారతీయుడు మృతిచెందగా, 63 మంది గాయపడ్డారు. మృతుడి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం 10 మంది భారతీయులు మృతి చెందినట్లు సమాచారం. డ్రోన్లతో భారీ దాడి తాజా ఘటనకు ఇరాన్ దాడులే కారణమని కువైట్ సైన్యం ప్రకటించింది. విమానాశ్రయంలోని తొలి టెర్మినల్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున డ్రోన్ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల వల్ల విమానాశ్రయ సదుపాయాలు, కార్యకలాపాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. దాడుల అనంతరం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
వివరాలు
కువైట్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
తదుపరి ప్రకటన వచ్చే వరకు విమానాలను సమీప విమానాశ్రయాలకు మళ్లించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దౌత్య కార్యాలయ ప్రతినిధిని విదేశాంగ శాఖకు పిలిపించి అధికారిక నిరసన లేఖ అందజేసింది. అలాగే ఇద్దరు ఇరానియన్ దౌత్యవేత్తలను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి, 24 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ ఇరాన్‌కు చెందిన 13 బాలిస్టిక్ క్షిపణులు, 17 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిలువరించాయని కువైట్ రక్షణశాఖ వెల్లడించింది. అయితే వాటి శకలాలు పలు నివాస భవనాలపై పడటంతో ఆస్తినష్టం జరిగినట్లు తెలిపింది.
వివరాలు
దక్షిణ లెబనాన్‌లోనూ దాడులు
ఇక దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. టైర్ నగరం సమీపంలో జరిగిన తాజా దాడుల్లో సిరియాకు చెందిన నలుగురు, పాలస్తీనాకు చెందిన ఇద్దరు మరణించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. దాడిని ఖండించిన భారత్ కువైట్‌లో జరిగిన దాడిలో భారతీయుడు మృతిచెందడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రాంతంలో హింసాత్మక ఘటనలకు ముగింపు పలకాలని, పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులకు ప్రతీకార చర్యే గెరుక్, ఖేష్మ్ ద్వీపాలపై శని, ఆదివారాల్లో అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే గల్ఫ్ దేశాలపై దాడులు చేపట్టినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)ప్రకటించింది. కువైట్‌లోని అల్ సలేమ్ వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరం సహా పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.