Loading...
Laos: చిన్న దేశం.. పెద్ద నిర్ణయం.. ఈవీలతో కొత్త దిశగా లావోస్
చిన్న దేశం.. పెద్ద నిర్ణయం.. ఈవీలతో కొత్త దిశగా లావోస్

Laos: చిన్న దేశం.. పెద్ద నిర్ణయం.. ఈవీలతో కొత్త దిశగా లావోస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగం వేగంగా మారుతోంది. సంప్రదాయ పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ మార్పును మరింత వేగవంతం చేసే దిశగా దక్షిణాసియాలోని చిన్న దేశం లావోస్‌ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొత్తగా దిగుమతి అయ్యే పెట్రోల్‌,డీజిల్‌ ప్యాసింజర్‌ కార్లపై ఆంక్షలు విధిస్తూ ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం, కొత్తగా దిగుమతి అయ్యే వ్యక్తిగత ప్రయాణికుల వాహనాల్లో ప్రధానంగా ఎలక్ట్రిక్‌ కార్లకే అనుమతి ఉంటుంది. దీంతో లావోస్‌ ఆటోమొబైల్‌ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లైంది.ఈ నిర్ణయంతో దేశంలోని రోడ్లపై వాహనాల రూపురేఖలు మారనున్నాయనే చర్చ మొదలైంది.

వివరాలు 

పర్యావరణంతో పాటు ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన కారణం

అయితే ఇది పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై పూర్తిస్థాయి నిషేధం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రజా రవాణా వాహనాలు, నిర్మాణ రంగంలో ఉపయోగించే వాహనాలు,అలాగే ప్రత్యేక అవసరాల కోసం వినియోగించే వాహనాలకు ఈ నిర్ణయం వర్తించదు.

ప్రధానంగా కొత్త వ్యక్తిగత కార్ల మార్కెట్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

ఈ నిర్ణయం వెనుక కాలుష్య నియంత్రణ ఒక్కటే కారణం కాదు. లావోస్‌కు అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది.

దీంతో విదేశీ మారక నిల్వలపై అదనపు భారం పడుతోంది.

మరోవైపు దేశంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి అధికంగా ఉండటంతో స్థానికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించడం ఆర్థికంగా మరింత లాభదాయకమని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

చిన్న దేశం.. కానీ పెద్ద ప్రయోగం

చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవడం కూడా ఈ నిర్ణయానికి కీలక కారణంగా నిలిచింది.

లావోస్‌ వాహన మార్కెట్‌ భారత్‌తో పోలిస్తే చాలా చిన్నది.అందువల్ల అక్కడ అమలు చేసిన విధానాన్ని భారత్‌ వంటి భారీ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో యథాతథంగా అమలు చేయడం సాధ్యం కాదు.

భారత్‌లో కోట్ల సంఖ్యలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు ఉండటంతో పాటు రవాణా వ్యవస్థ, ఛార్జింగ్‌ మౌలిక వసతులు, ఆటో పరిశ్రమ, ఉపాధి వంటి అనేక అంశాలు ఈవీ మార్పును ప్రభావితం చేస్తాయి.

అందుకే భారత్‌ దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధానాన్ని అనుసరిస్తోంది.

అయితే లావోస్‌ నిర్ణయం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది.ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవాలనుకునే చిన్న దేశాలకు ఎలక్ట్రిక్‌ వాహనాలు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

చైనా ఈవీ కంపెనీలకు అవకాశాలు

లావోస్‌ తాజా నిర్ణయం చైనా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలకు కొత్త అవకాశాలు తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే తక్కువ ధరల్లో ఈవీలను అందిస్తున్న చైనా కంపెనీలు చిన్న మార్కెట్లలో తమ ఉనికిని వేగంగా విస్తరిస్తున్నాయి.

ఈ విధానంతో లావోస్‌ మార్కెట్లో వాటి వాటా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రపంచానికి కొత్త సంకేతం

లావోస్‌ నిర్ణయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.

పెట్రోల్‌ ఆధారిత వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మార్పు కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాకుండా, శక్తి భద్రత, ఇంధన దిగుమతుల నియంత్రణ, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలతోనూ ముడిపడి ఉందని ఈ నిర్ణయం సూచిస్తోంది.

చిన్న దేశం తీసుకున్న ఈ అడుగు భవిష్యత్తులో మరిన్ని దేశాల విధానాలకు మార్గదర్శకంగా మారుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT