LOADING...
Kailash Mansarovar Yatra: ముదిరిన లిపులేఖ్‌ సరిహద్దు వివాదం.. మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ అభ్యంతరం
ముదిరిన లిపులేఖ్‌ సరిహద్దు వివాదం.. మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ అభ్యంతరం

Kailash Mansarovar Yatra: ముదిరిన లిపులేఖ్‌ సరిహద్దు వివాదం.. మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ అభ్యంతరం

వ్రాసిన వారు Moogati Shabari
May 05, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని లిపులేఖ్‌ కనుమ మార్గంగా నిర్వహించే కైలాశ్‌ మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్‌ ఖండించింది. ఏకపక్షంగా సరిహద్దులను కృత్రిమంగా విస్తరించుకుని భూభాగాలపై హక్కులు ప్రకటించడం అనేది అసంబద్ధమని స్పష్టం చేసింది. గత వారం విదేశాంగ శాఖ ప్రకారం, ప్రతి సంవత్సరం జూన్‌ నుండి ఆగస్టు వరకు మానస సరోవర్‌ యాత్ర నిర్వహించబడుతుంది. అయితే తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా భారత్‌, చైనా కలిసి లిపులేఖ్‌ మార్గం ద్వారా యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ నేపాల్‌ విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది.

వివరాలు

ఆ భూభాగంపై వివాదం..

ఆ ప్రకటనలో లిపులేఖ్‌ తమ భూభాగంలో భాగమని నేపాల్‌ పేర్కొంది. దీనికి భారత్‌ కొన్ని గంటల్లోనే ప్రతిస్పందించింది. ఈ అంశంపై తమ దృక్పథం ఎప్పటిలాగే స్పష్టంగా, స్థిరంగా ఉందని తెలిపింది. 1954 నుంచే లిపులేఖ్‌ కనుమ కైలాశ్‌ మానస సరోవర్‌ యాత్రకు సంప్రదాయ మార్గంగా ఉపయోగంలో ఉందని విదేశాంగ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరించారు. అనేక దశాబ్దాలుగా ఇదే మార్గంలో యాత్ర కొనసాగుతోందని చెప్పారు. నేపాల్‌ చేస్తున్న వాదనలు సరైనవి కావని, వాటికి చారిత్రక ఆధారాలు లేవని భారత్‌ మొదటి నుంచే చెబుతూ వస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement