
Tiger Woods: ట్రంప్ మాజీ కోడలితో టైగర్‌వుడ్స్ ప్రేమాయణం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోడలితో తాను సంబంధంలో ఉన్నానని ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ (Tiger Woods) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
వెనెసా (Vanessa)తో తాను డేటింగ్ చేస్తున్నానని ఆయన ప్రకటించారు. ''నీ ప్రేమలో ఉంటే, గాల్లో తేలినట్లుంటుంది.. నువ్వు నా పక్కన ఉంటే జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది'' అని టైగర్ వుడ్స్ తన భావాలను వ్యక్తపరిచారు.
అంతేకాకుండా, ఆమెతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు.
ఈ విషయంపై తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వెనెసా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టైగర్ వుడ్స్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, తమ బంధాన్ని ధృవీకరించారు.
వివరాలు
ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం
డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (Donald Jr)కు ఆమె మాజీ భార్య కావడంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో వాడివేడి చర్చ జరుగుతోంది.
ట్రంప్ జూనియర్ 2005లో వెనెసాను వివాహం చేసుకున్నారు. అయితే,కొన్ని సంవత్సరాల తర్వాత వారి మధ్య విభేదాలు ఏర్పడటంతో,13ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2018లో విడాకులు తీసుకున్నారు.
వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు.అనంతరం ట్రంప్ జూనియర్ 2020లో ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇక ఇటీవల,డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మరో యువతితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఓ అమ్మాయి చేయిపట్టుకుని నడుస్తున్న ఆయన చిత్రాలు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో,కింబర్లీతో ఆయన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది.