LOADING...
JetBlue: అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

JetBlue: అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని బోస్టన్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లో ఉన్న లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం రన్‌వేపై అదుపు తప్పి ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది. విమానం రన్‌వే నుంచి జారిపడి పక్కకు వెళ్లిపోయినప్పటికీ, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పించగలిగారు. జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 312 నంబర్ విమానం షికాగో నగరం నుంచి బయల్దేరి బోస్టన్‌లోని లోగాన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వేపై అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. ఇది రన్‌వే మీద నుంచి పక్కకు జారిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రించగలిగాడు. దాంతో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాలు 

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం

ఈ ఘటనపై జెట్‌బ్లూ సంస్థ అధికారికంగా స్పందించింది. ల్యాండింగ్ అయిన తరువాత విమానం రన్‌వే నుంచి పక్కకు జారిన విషయాన్ని ధ్రువీకరించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సంస్థ పేర్కొంది. కాగా, గురువారం మధ్యాహ్నం మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం