Page Loader
Lufthansa: యూదు ప్రయాణీకులను విమానం ఎక్కకుండా  అడ్డుకొన్న లుఫ్తాన్సా.. $4 మిలియన్ల జరిమానా విధించిన అధికారులు 
లుఫ్తాన్సా కి $4 మిలియన్ల జరిమానా విధించిన అధికారులు

Lufthansa: యూదు ప్రయాణీకులను విమానం ఎక్కకుండా  అడ్డుకొన్న లుఫ్తాన్సా.. $4 మిలియన్ల జరిమానా విధించిన అధికారులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు అమెరికా అధికారాలు భారీగా జరిమానా విధించారు. 2022లో 128 మంది యూదు ప్రయాణికులను ఆ విమాన సిబ్బంది ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 4 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. అప్పుడు కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. అమెరికాలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుండి జర్మనీకి వెళుతున్న విమానంలో కొందరు యూదు ప్రయాణికులు నిబంధనలు పాటించలేదని నాటి విమాన కెప్టెన్‌ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మొత్తం 128 మంది యూదులను బోర్డింగ్‌కు అనుమతించలేదు. వారి దుస్తులు, నల్లటి టోపీలు, జాకెట్స్‌ను చూసి మొత్తం ఒకే గ్రూపు అని భావించారు. కానీ వాస్తవానికి వీరిలో చాలామందికి పరస్పర పరిచయం కూడా లేదు.

వివరాలు 

అమెరికా డివోటీ అధికారులు దర్యాప్తు

ఈ ఘటనను జాతి వివక్షగా భావించి 40 మంది నుండి ఫిర్యాదులు అందించడంతో, అమెరికా డివోటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వారి వేషధారణ యూదుల వలే కనిపించడంతో, లుఫ్తాన్సా వారు బోర్డింగ్‌కు అనుమతించలేదని గుర్తించారు. దాంతో, 4 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు. మరోవైపు, లుఫ్తాన్సా తమ సిబ్బంది జాతి వివక్ష చూపించలేదని బలంగావాదిస్తోంది.