LOADING...
Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్ 
Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ మాల్దీవులు

Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్ 

వ్రాసిన వారు Stalin
Jan 07, 2024
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

Maldives suspends 2 ministers: ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది. మరియం షియునా, హసన్ జిహాన్‌లను మాల్దీవులు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధానిపై వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈరోజు మాల్దీవుల ప్రభుత్వం మాట్లాడింది. మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ద్వీప దేశం మాల్దీవులు.. ఇద్దరు మంత్రను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా.. ప్రధాని నరేంద్ర మోదీని 'మోటువాడు', 'తోలుబొమ్మ' అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆపోస్టును తొలగించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాల్దీవుల మంత్రులపై మోదీ ఎఫెక్ట్