Page Loader
Mali: మాలి మైన్ కుప్పకూలి.. 10 మంది మృతి
మాలి మైన్ కుప్పకూలి.. 10 మంది మృతి

Mali: మాలి మైన్ కుప్పకూలి.. 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. బంగారు గనిలో కొండ చరియలు కూలిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది అదృశ్యమైనట్లు సమాచారం అందుతుంది. కౌలికోరో ప్రాంతంలో ఉన్న బంగారు గనిలో బుధవారం ఈ ఘటన జరిగింది. అక్కడి గవర్నర్ కల్నల్ లామైన్ కపోరీ సనొగో ఈ విషయం తెలియజేశారు. "గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో బంగారం కోసం వెతుకుతున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. గనిలోకి బురదనీరు ప్రవేశించి వారిని చుట్టిముట్టింది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకొనిపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది" అని గవర్నర్ తెలిపారు.

వివరాలు 

మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారిగా  మాలి 

ఆఫ్రికా దేశాల్లో మాలి దేశం మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారిగా ఉంది. ఈ దేశంలో బంగారు గని ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి. గత సంవత్సరంలో కూడా ఇదే ప్రాంతంలో ఉన్న కంగబా జిల్లాలో ఒక బంగారు గని కుప్పకూలింది. ఆ ప్రమాదంలో 70 మందికి పైగా మరణించారు.