
Bomb Threat: విమానం గాల్లో ఉండగా.. బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు.. స్కాట్లాండ్‌లో వ్యక్తి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రయాణం మధ్యలోనే ఓ ప్రయాణికుడి వ్యవహారం భయానక వాతావరణాన్ని కలిగించింది. తన వద్ద బాంబు ఉందని, దాన్ని పేల్చేస్తానంటూ కేకలు వేసిన ఘటన స్కాట్లాండ్‌లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లుటన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గ్లాస్గో నగరానికి రవాణా కోసం ఈజీజెట్ అనే విమానం ఆదివారం సాయంత్రం బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగరిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడు ఆకస్మాత్తుగా తన సీటు నుంచి లేచి గట్టిగట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు 'నా దగ్గర బాంబు ఉంది. ఈ విమానాన్ని పేల్చేస్తా. అమెరికాకు చావు.. ట్రంప్‌నకు మరణం' అంటూ అరిచాడు. దీంతో విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
వివరాలు
స్కాట్లాండ్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన
వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఈ హఠాత్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విమానాన్ని సమీపంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. విమానం భద్రంగా భూమిపైకి దిగి వెంటనే ఆ ప్రయాణికుడిని పోలీసులకి అప్పగించారు. అయితే ఆ వ్యక్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. స్కాట్లాండ్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో విమానంలో జరిగిన బెదిరింపు ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానం గాల్లో ఉండగా.. బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు
‘DEATH to Trump’ and ‘ALLAHU AKBAR’ — man causes panic on flight
— RT (@RT_com) July 27, 2025
Says he’s going to ‘BOMB the plane’
SLAMMED to ground by passenger pic.twitter.com/mVYwXqx7Yr