London-stabbed-injuries: లండన్ లో ఓ వ్యక్తి వీరంగం.. పలువురికి గాయాలు
లండన్ లో ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు.నార్త్ ఈస్ట్ లండన్ లోని ట్యూబ్ స్టేషన్లో ఓ 36 ఏళ్ల వ్యక్తి కత్తి పట్టుకుని దొరికిన వారు దొరికినట్టుగా పొడిచాడు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం హైనాల్ట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది . విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు . 36 ఏళ్ల ఆ వ్యక్తి కత్తిపట్టుకుని వీధుల్లో తిరుగుతూ వీరంగం సృష్టించడాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఇతడికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధంలేదని పోలీసులు వెల్లడించారు.