Page Loader
China: చైనాలో ఉన్మాది కత్తితో దాడి.. ఎనిమిది మంది మృతి
చైనాలో ఉన్మాది కత్తితో దాడి.. ఎనిమిది మంది మృతి

China: చైనాలో ఉన్మాది కత్తితో దాడి.. ఎనిమిది మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ ఉన్మాది కత్తితో దాడి చేయడంతో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలో జరిగిన ఈ దారుణ ఘటనలో 21 ఏళ్ల నిందితుడు స్కూల్‌లోకి ప్రవేశించి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన 17 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Details

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షల్లో ఫెయిలవడం, స్టైఫండ్ అగిపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి తర్వాత పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఐదు రోజుల కిందట జుహై సిటీలో ఓ ఉన్మాది కారుతో తొక్కించి 35 మందిని చంపేసిన విషయం తెలిసిందే.