Markwayne Mullin: హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా మార్క్‌వేన్ ముల్లిన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) కొత్త కార్యదర్శిగా సెనేటర్ మార్క్‌వేన్ ముల్లిన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముల్లిన్‌ను "నిజమైన అమెరికా దేశభక్తుడు"గా ప్రశంసించిన ట్రంప్, అక్రమ వలసలు,సరిహద్దు భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కీలక బాధ్యతను ముల్లిన్ సమర్థంగా నిర్వహిస్తారన్ననమ్మకం తనకు ఉందని ఆయన తెలిపారు. వైట్ హౌస్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ,సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం,వలసదారుల ద్వారా జరుగుతున్న నేరాలను నియంత్రించడం వంటి అంశాల్లో ముల్లిన్ తమ ప్రభుత్వానికి కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ముల్లిన్ గత 13 ఏళ్లుగా కాంగ్రెస్‌లో సేవలందిస్తున్నారు.
వివరాలు
చెరోకీ నేషన్ తొలి సభ్యుడు
సెనేట్‌లో ఏకైక స్థానిక అమెరికన్‌గా ఉన్న ఆయన,క్యాబినెట్‌లో చేరిన తొలి చెరోకీ నేషన్ సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ముల్లిన్ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)రంగంలో అపజయం ఎరుగని ఫైటర్‌గా కూడా ప్రసిద్ధి గాంచారు. ఈకార్యక్రమం సందర్భంగా ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష డెమోక్రాట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు అవసరమైన నిధులు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాల విధానాల కారణంగా సుమారు 2.5కోట్ల మంది అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని, దాంతో నేరాల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ముల్లిన్ నాయకత్వంలో అక్రమ వలసదారులైన నేరస్థులను వేగంగా దేశం నుంచి బహిష్కరించే చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు.