Indonesia: 7.4 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ భూకంపానికి కేంద్రం మొలుక్కా సముద్రంలో, టెర్నెట్ దీవికి సుమారు 127 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో సమీప ప్రాంతాలపై అప్రమత్తత పెరిగింది. ముఖ్యంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాల్లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం.. సునామీ ముప్పు
Vanuatu Earthquake: 7.3 Magnitude Quake Hits Near Port Vila, Loganville, Tsunami Warning Issuedhttps://t.co/D4ZbMuKfA5
— TIMES NOW (@TimesNow) March 30, 2026