Loading...
Peru Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.9 తీవ్రత..!
పెరూలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.9 తీవ్రత..!

Peru Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.9 తీవ్రత..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ అమెరికా దేశమైన పెరూలో భారీ భూకంపం సంభవించింది. మధ్య పెరూలోని ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:09 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది.

వివరాలు

జునిన్‌కు ఉత్తరాన భూకంప కేంద్రం

ఆండీస్‌ పర్వత ప్రాంతంలోని జునిన్‌కు ఉత్తరాన 34 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.

భూమి అంతర్భాగంలో 108 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ప్రారంభమైనట్లు వెల్లడించింది.

లిమాలోనూ భూప్రకంపనలు

భూకంప ప్రకంపనలు పెరూ రాజధాని లిమాను సైతం తాకాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పెరూ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది.

వివరాలు

రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ పరిధిలో పెరూ

ప్రపంచంలో తరచుగా భూకంపాలు సంభవించే పసిఫిక్‌ బేసిన్‌లోని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో పెరూ ఉంది. ఈ కారణంగా దేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఈ ఏడాది ఆగస్టులోనూ పెరూలోని ఆండీస్‌ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. అనేక ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలతో పాటు ఇతర భవనాలు దెబ్బతిన్నాయి.

అలాగే జూలైలో జునిన్‌ ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు.

ADVERTISEMENT