Trump: ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం: ఉద్రిక్తతల మధ్య ట్రంప్ తాజా హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆందోళనకారులను అణచివేస్తోన్న ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఆ దేశంలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ పాలకులకు హెచ్చరికలు చేశారు. అమెరికా ఇప్పటికే ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించిందని, ఆ దేశం వైపు అతిపెద్ద సైన్యం కదులుతోందని ఆయన తెలిపారు. ఇరాన్‌కు తాము నష్టం కలిగించాలనుకోదని ట్రంప్ తెలిపారు.
వివరాలు
800 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలను కాపాడం: ట్రంప్
అయినప్పటికీ, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సడలలేదని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, భవిష్యత్తులో ఏం జరగబోతోందో చూసుకుందామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అధ్యక్ష భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో చేశారు. ఇరాన్‌లో వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. "తన చర్యల వల్ల 800 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలను కోల్పోవడం నుండి తప్పించాము" అని ట్రంప్ చెప్పారు. వారిని ఉరితీసే ప్రయత్నం జరిగినా,తాను ఆపడం వలన ఇరాన్ పాలకులు వెనక్కి తగ్గారని ఆయన తెలిపారు.
వివరాలు
'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' సహా పలు యుద్ధనౌకలు
కాగా,రాబోయే రోజుల్లో అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక, ఇతర సైనిక దళాలు పశ్చిమాసియాకు చేరుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి అంతర్జాతీయ మీడియా వివరాల ప్రకారం,ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో,ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న యుద్ధనౌకలలో 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' సహా పలు యుద్ధనౌకలు ముందుకు కదిలినట్లు పేర్కొన్నాయి. వీటికి తోడుగా అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియాకు పంపడానికి వైట్ హౌస్ కార్యాలయం సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.