
ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ నుంచి దోహాకు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.
దిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానంలో అబ్దుల్లా (60)కు ఆరోగ్య సమస్య తలెత్తింది. ఈ క్రమంలో మెడికల్ ఎమర్జేన్సీ నిమిత్తం విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం పాకిస్థాన్‌లోని కరాచీకి తరలించారు. ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ప్రయాణీకుడు మరణించినట్లు కరాచీలోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.
కరాచి
అబ్దుల్లా మృతి పట్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ దిగ్భ్రాంతి
సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది.
పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఇస్లామాబాద్ (ఎన్ఐహెచ్) వైద్యులు అబ్దుల్లా మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
అబ్దుల్లా మృతి పట్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.