స్పైస్‌జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
విమానాల్లో కొందరు ప్రయాణికులు సిబ్బంది పట్ల , తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల సంఘటనలు మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
దిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో మహిళా సిబ్బందితో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. అలాగే క్యాబిన్ సిబ్బందిపై కూడా అతను దురుసుగా ప్రవర్తించినట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తెలిపింది. ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్‌కు సిబ్బంది తెలియజేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పైస్‌జెట్
ప్రయాణికుడిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు
విమానంలో జరిగిన సంఘటనను సెక్యూరిటీ సిబ్బందికి పైలట్ ఇన్ కమాండ్ సమచారం అందిచారు. సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన అతడిని అబ్సర్ ఆలం అనే వ్యక్తిగా గుర్తించారు. అనంతరం సిబ్బంది అబ్సర్ ఆలంతో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని విమానం నుంచి దించేశారు.
ఆ తర్వాత అబ్సర్ ఆలంను పోలీసులకు అప్పగించారు. దిల్లీ పోలీసులు అతడిపై సెక్షన్ 354ఏ కింద కేసు కూడా నమోదు చేశారు.
విమానాల్లో ప్రయాణికుల ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. అందులో భాగంగానే సోమవారం జరిగిన ఈ సంఘటనను వెంటనే తెలియజేసింది.