Elon Musk: 'నా బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి'.. సోషల్ మీడియా వేదికగా ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)గురించి రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు.
తన బిడ్డకు తండ్రి మస్క్ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
''ఐదునెలల క్రితం నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను.నా చిన్నారికి ఎలాన్ మస్క్ తండ్రి.మా బిడ్డ గోప్యత,భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇంతకు ముందు ఈ విషయాన్ని బయట పెట్టలేదు.
కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నించాయి.
అందుకే నేనే ప్రకటిస్తున్నాను.మా బిడ్డ సురక్షితమైన వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నాను.
మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను''అని తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే,ఈ అంశంపై ఎలాన్ మస్క్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.
వివరాలు
ఎలాన్ మస్క్‌కు మొత్తం 12మంది సంతానం
ఎలాన్ మస్క్‌కు మొత్తం 12మంది సంతానం ఉన్నారు. అతని మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో 10వారాలకే మృతి చెందాడు.
ఆ తరువాత, ఐవీఎఫ్ విధానంలో ఆ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
2008లో వారిద్దరూ విడిపోయారు.ఆ తర్వాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ వివాహమాడారు, అయితే వారికి సంతానం లేదు.
అనంతరం,కెనడియన్ గాయని గ్రిమ్స్‌తో సంబంధం కొనసాగించారు.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అలాగే, తన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్‌లో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్‌తోనూ మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు ఇటీవల మస్క్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే, మస్క్-జస్టిన్ దంపతులకు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం లింగ మార్పు చేసుకుని అమ్మాయిగా మారారు.
వివరాలు
ఆమె ఇలా మారడానికి ప్రధాన కారణం ఆమె చదువుకున్న విద్యాసంస్థలే
తన తండ్రితో (ఎలాన్ మస్క్) ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా, పూర్తిగా అతని నుంచి దూరంగా ఉండాలని జేవియర్ వెల్లడించారు. ఆయన తన పేరు జెన్సా విల్సన్‌గా మార్చుకున్నారు.
దీనిపై మస్క్ ఒక సందర్భంలో స్పందిస్తూ, ''జెన్నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయి.ఆమె డబ్బు ఉన్నవారందరినీ చెడ్డవారిగా భావిస్తుంది.ఆమె ఇలా మారడానికి ప్రధాన కారణం ఆమె చదువుకున్న విద్యాసంస్థలే.ఆమెతో మళ్లీ మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాను,కానీ ఆమె నాతో కాస్త సమయమైనా గడపడానికి ఇష్టపడటం లేదు.జెన్నాతో విభేదాలు రావడం నాకు చాలా బాధగా ఉంది.నా మొదటి కుమార్తె మృతికి కంటే, జెన్నాతో విభేదాలే నన్ను ఎక్కువ బాధించాయి''అని వ్యాఖ్యానించారు.