LOADING...
Mehul Choksi : మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం
మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం

Mehul Choksi : మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB) నుంచి రూ.13,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ, చాలా కాలంగా బెల్జియంలోనే ఉండేవాడు. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత బెల్జియం అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే భారత ప్రభుత్వం ఎన్నో సార్లు మెహుల్‌ను భారత్‌కు అప్పగించాలని కోరుతూ అడుగులు వేసింది. ఇప్పటివరకు బెల్జియం కోర్టు ఆలోచనలో ఉన్నా, ఇప్పటిదాకా ఒప్పుకోలేదు. తాజాగా, నిన్న బెల్జియం కోర్టు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించడానికి సిద్ధమని ప్రకటించింది. భారత ప్రభుత్వ అభ్యర్థన ప్రకారం మెహుల్‌ను అరెస్ట్ చేయడం సరైనదని బెల్జియం న్యాయస్థానం స్పష్టం చేసింది.

Details

 ఏకాంతంగా నిర్బంధం 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంట్వర్ప్‌లోనే మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు అతనిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మెహుల్ అక్కడే ఉన్నాడు. ఇటీవల అతను బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దేశం నుంచి పారిపోతాడని భావించి బెల్జియం కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. అతనికి పై కోర్టుకి అప్పీల్ చేసే అవకాశం ఉన్నా, భారత్‌కి అప్పగించడమే కచ్చితంగా నిర్ణయమని భావించింది. అతన్ని అప్పగిస్తే ఏకాంతంగా నిర్బంధం, అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో బెల్జియం కోర్టు మెహుల్‌ను భారత్‌కు అప్పగించడానికి అంగీకరించింది.