
Melania Trump: "గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళలే సరైన నిర్ణయం తీసుకోగలరు".. అబార్షన్ హక్కును సమర్థించిన మెలానియా
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అంశాల్లో అబార్షన్ హక్కు ఒకటిగా ఉంది.
అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్ (Kamala Harris) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య గత నెలలో జరిగిన డిబేట్‌లో గర్భవిచ్ఛిత్తి అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ (Melania Trump) నుండి కీలక స్పందన వచ్చింది.
ట్రంప్ అబార్షన్ హక్కుల విషయంలో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని వాదించగా, మెలానియా అబార్షన్ హక్కుకు మద్దతు తెలిపారు.
వివరాలు
'మెలానియా' పేరుతో అక్టోబర్ 8న విడుదల కానున్న మెమోర్
అక్టోబర్ 8న విడుదల కానున్న 'మెలానియా' మెమోయర్‌లో ఆమె ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆమె రాసిన ప్రకారం, "ఒక మహిళ తన శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకే ఉండాలి. అవాంఛిత గర్భానికి సంబంధించి ఆమె తీసుకునే నిర్ణయాన్ని పరిమితం చేయడం అన్యాయమే. ఇలాంటి చర్యలు మహిళల స్వేచ్ఛను దెబ్బతీస్తాయి" అని అన్నారు.
నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. దానికి కొన్ని వారాల ముందు ఈ పుస్తకం విడుదల కానుంది.
వివరాలు
అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు
గత నెల జరిగిన డిబేట్‌లో కమలా హారిస్ మాట్లాడుతూ,"మహిళల హక్కులను ట్రంప్ అంగీకరించరు. అబార్షన్‌లపై పూర్తిగా నిషేధం విధించాలని ప్రయత్నిస్తున్నారు.అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లోనూ మినహాయింపులు ఇవ్వాలని భావించడం లేదు. ఇది మహిళల అవమానమే!అధ్యక్షుడిగా ఎన్నికైతే,ట్రంప్ జాతీయ అబార్షన్ నిషేధానికి సంతకం చేస్తారు.
గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళలే సరైన నిర్ణయం తీసుకోగలరు.అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు"అని అన్నారు.
దీనికి ట్రంప్ స్పందిస్తూ,"కమలా అబద్ధం చెబుతున్నారు.నేను అబార్షన్ నిషేధాన్ని మద్దతు ఇవ్వడం లేదు,అలాంటి బిల్లుపై సంతకం చేయను"అని స్పష్టం చేశారు.
అయితే ఎనిమిది లేదా తొమ్మిది నెలల్లో గర్భవిచ్ఛిత్తి చేయడం ఆయనకు ఆమోదయోగ్యం కాదని తెలిపారు.
కమల ఈ విషయంలో కాంగ్రెస్ చట్టం చేయాలని పిలుపునిచ్చారు,కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో రాష్ట్రాలకే అధికారం ఉండాలని అభిప్రాయపడ్డారు.