Loading...
Melania Trump: డేటింగ్ విషయంలో బారెన్ ట్రంప్‌కు మెలానియా హెచ్చరిక.. ఏం చెప్పారంటే?
డేటింగ్ విషయంలో బారెన్ ట్రంప్‌కు మెలానియా హెచ్చరిక.. ఏం చెప్పారంటే?

Melania Trump: డేటింగ్ విషయంలో బారెన్ ట్రంప్‌కు మెలానియా హెచ్చరిక.. ఏం చెప్పారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తన కుమారుడు బారెన్ ట్రంప్‌కు డేటింగ్ విషయంలో తరచూ జాగ్రత్తలు చెబుతుంటానని వెల్లడించారు. బయటి ప్రపంచం చాలా ప్రమాదకరమైనదని, జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తుంటానని తెలిపారు. అదే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తానని చెప్పారు. 'మెలానియా: ది సిరీస్' (Melania: The Series) అనే డాక్యుమెంటరీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

వివరాలు

పిల్లల ప్రతి కదలికను గమనిస్తుంటారు

బయటి ప్రపంచం చాలా ప్రమాదకరమైనదని బారెన్‌ను తరచూ హెచ్చరిస్తుంటానని మెలానియా తెలిపారు.

భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, జీవితంలో వచ్చే ఒడుదొడుకులను ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి ఎలా ముందుకు సాగాలి? అనే విషయాలపై కుమారుడితో చర్చిస్తుంటానని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడి కుటుంబ సభ్యులం కావడంతో తమ ప్రతి చిన్న కదలిక, ప్రవర్తనను అందరూ నిశితంగా గమనిస్తుంటారని మెలానియా పేర్కొన్నారు.

అందుకే పిల్లలను బహిరంగ ప్రదేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉంచడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వివరించారు.

అయితే పిల్లలపై ఆంక్షలు విధించనని, వారితో స్నేహపూర్వకంగా ఉండటానికే ఇష్టపడతానని తెలిపారు.

వివరాలు

బారెన్ దృష్టి ఉన్నత చదువులపైనే

తన కుమారుడు బారెన్ చాలా ఆత్మవిశ్వాసం కలవాడని మెలానియా ప్రశంసించారు.

భవిష్యత్తులో అతడు ఉన్నత స్థానానికి చేరుకుంటాడనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

ప్రస్తుతం బారెన్ దృష్టి మొత్తం ఉన్నత చదువులపైనే ఉందని వెల్లడించారు.

ADVERTISEMENT