Meloni: ట్రంప్‌తో మాట్లాడాల్సి వచ్చినా బాధపడను: ఇటలీ ప్రధాని మెలోనీ
ఈ వార్తాకథనం ఏంటి
ట్రంప్‌తో మాట్లాడాల్సి వచ్చినా ఎలాంటి బాధ ఉండదు.. ఇటలీ ప్రయోజనాలే ముఖ్యం అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలోనీ మధ్య చోటుచేసుకున్న బహిరంగ విమర్శలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ నాటో సదస్సులో పాల్గొనడంతో వారిద్దరి భేటీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే సమావేశంలో ట్రంప్‌తో పెద్దగా మాట్లాడకుండా కనిపించిన మెలోనీ.. అనంతరం దీనిపై వివరణ ఇచ్చారు. ట్రంప్‌తో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా అందులో తప్పేమీ లేదని,తనకు ఎలాంటి పశ్చాత్తాపం ఉండదని ఆమె చెప్పారు. వ్యక్తిగత రాజకీయాల కంటే ఇటలీ ప్రయోజనాలకే తాను అధిక ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.
వివరాలు
విందు కార్యక్రమంలో కూడా ఇద్దరూ దూరంగానే
పశ్చిమ దేశాల మధ్య ఐక్యత కొనసాగడం అవసరమని, ఆ దిశగా అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించడం కూడా ఇటలీ ప్రయోజనాల కోసమేనని వెల్లడించారు. నాటో సదస్సులో ట్రంప్ వస్తుండగా తనను ఉద్దేశపూర్వకంగానే ఎదురుగా నిలబెట్టారనే ప్రచారాన్ని కూడా మెలోనీ ఖండించారు. ఇతర దేశాధినేతలు నిల్చున్నట్లుగానే తాను కూడా అక్కడ నిల్చున్నానని, ఇందులో ఎలాంటి వ్యూహం లేదా రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. నాటో దేశాధినేతల గ్రూప్ ఫొటో సందర్భంగా ట్రంప్ తన ముందుగా వెళ్లినా మెలోనీ ఆయనను పట్టించుకోనట్లుగా కనిపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అలాగే నాయకుల విందు కార్యక్రమంలో కూడా ఇద్దరూ దూరంగానే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
గతంలో ట్రంప్, మెలోనీ మధ్య సన్నిహిత సంబంధాలు
అయితే గతంలో ట్రంప్, మెలోనీ మధ్య సన్నిహిత సంబంధాలే ఉండేవి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు మెలోనీ కావడం విశేషం. కానీ గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు, యుద్ధానికి సంబంధించిన అంశాలపై మెలోనీ వైఖరిని ట్రంప్ బహిరంగంగానే విమర్శించారు. అనంతరం ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో ఇద్దరి మధ్య ఫొటో వివాదం మరింత చర్చకు దారితీసింది. ఆ సమావేశంలో తనతో ఫొటో దిగేందుకు మెలోనీ ప్రత్యేకంగా కోరారని, అందుకే అంగీకరించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండిస్తూ అవి వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్‌తో విభేదాల మధ్య మెలోనీ వ్యాఖ్యలు.. ఇటలీ ప్రయోజనాలకే ప్రాధాన్యం
NATO Moment: Meloni Turns Her Head as Trump Walks In 🚨 pic.twitter.com/c9kXnjpDbC
— The Finance Streets (@finance_streets) July 9, 2026