Page Loader
India-Bangladesh: బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు
బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు

India-Bangladesh: బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను సోమవారం పిలిపించింది. రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యను తీసుకున్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచిన తర్వాత, ఈ పరిణామం జరిగింది. బంగ్లాదేశ్ ఆరోపణ ప్రకారం, భారత్ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు ఐదు ప్రాంతాలలో ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. చపైనవాబ్‌గంజ్, నౌగావ్, లాల్మోనిర్హాట్, తీన్ బిఘా కారిడార్ వంటి ఐదు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. భారత్ నుండి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు కూడా బంగ్లాదేశ్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి.

Details

బంగ్లాదేశ్ లో భారత్ పై వ్యతిరేకత

ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌కు సమన్లు జారీ చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో భారతపై వ్యతిరేకత పెరుగుతోంది. ఆగస్టు 5న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి అధికారం చేపట్టారు. యూనస్ పరిణామం తర్వాత, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావనలు మరింత బలపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి పార్టీలు భారత వ్యతిరేకతను ప్రేరేపిస్తున్నాయని తెలిసింది. ఈ పరిస్థితుల మధ్య, బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు కూడా కొనసాగుతున్నాయి.