Mirza Fakhrul Islam Alamgir: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్ ఎన్నిక
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. 78 ఏళ్ల ఆయనకు పార్లమెంటులో 255 మంది సభ్యుల మద్దతు లభించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన మీర్జా ఫఖ్రూల్.. ఆగస్టు 21న దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం విశేషం. అధ్యక్ష ఎన్నికల కోసం మొత్తం 349 మంది చట్టసభ సభ్యులు నమోదు చేసుకున్నారు. వీరిలో 343 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మరో ఆరుగురు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
వివరాలు
మొహ్మద్ షాబుద్దీన్ రాజీనామా
విపక్ష కూటమి తరఫున పోటీ చేసిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఛైర్మన్, రిటైర్డ్ కర్నల్ ఓలి అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మొహ్మద్ షాబుద్దీన్ ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన రాజీనామాకు ఆరోగ్య సమస్యలే కారణమని షాబుద్దీన్ వెల్లడించారు.