NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా
    అంతర్జాతీయం

    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా

    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 04, 2023, 03:01 pm 0 నిమి చదవండి
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా

    చైనా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ప్రతినిధి శనివారం స్పందించారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాంగ్ చావో పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో చైనా రక్షణ వ్యయం వాటా చాలా ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం ఆ దేశ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ వ్యయం పెరగొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే బడ్జెట్ పెరుగుదల అనేది సహేతుకమైనదని వాంగ్ చావో చెప్పారు.

    చుట్టూ వివాదాలే, సైన్యాన్ని విస్తరించే యోచనలో చైనా!

    ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ ఎంత పెరుగుతుంది? ఎక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? అనేది వాంగ్ వెల్లడించలేదు. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌కు సంబంధించి గణాంకాలను చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సైన్యం సంక్షేమం కోసం కేటాయించే బడ్జెట్‌ను ప్రపంచ శాంతికి ముప్పుగా భావించవద్దని, దాన్ని మామూలుగానే పరిగణించాలని చైనా చెబుతోంది. చైనా ఆక్రమిత ద్వీపాల్లో భద్రత, దక్షిణ చైనా సముద్రంలో సమీపంలో అమెరికా నావికా దళం వైమానిక కార్యకలాపాలు, భారత్‌తో చెలరేగుతున్న సరిహద్దు ప్రతిష్ఠంభన.. ఇలా చైనా చుట్టూ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో సైన్యాన్ని మరింత విస్తరించాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    చైనా
    ఆర్మీ

    చైనా

    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు ప్రపంచ ఆరోగ్య సంస్థ
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు భారతదేశం
    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక కోవిడ్

    ఆర్మీ

    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం
    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్ రాజస్థాన్

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023