Loading...
SCO Summit begins today: ఒకే వేదికపై మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌.. ప్రపంచం చూపంతా బిష్కెక్‌పైనే
ఒకే వేదికపై మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌.. ప్రపంచం చూపంతా బిష్కెక్‌పైనే

SCO Summit begins today: ఒకే వేదికపై మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌.. ప్రపంచం చూపంతా బిష్కెక్‌పైనే

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు ప్రధాన శక్తుల అధినేతలు ఒకే వేదికపైకి రానుండటంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో సోమవారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ ముగ్గురు నేతల భేటీ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం తదితర కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ, జిన్‌పింగ్‌ మధ్య జరిగే సమావేశంపై అంతర్జాతీయంగా ప్రత్యేక దృష్టి నెలకొంది.

వివరాలు 

రెండు రోజుల పాటు ఎస్‌సీవో సదస్సు

బిష్కెక్‌లో సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది.

రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు.

ఎస్‌సీవో ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈసారి సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

సదస్సులో ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాల నియంత్రణ వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు.

అదే సమయంలో వాణిజ్య సంబంధాల విస్తరణ, ఇంధన రంగంలో సహకారం, రవాణా అనుసంధానం, డిజిటల్‌ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

వివరాలు 

బిష్కెక్‌ చేరుకున్న ప్రధాని మోదీ

వీటితో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఉక్రెయిన్‌ యుద్ధం, ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఉజ్బెకిస్థాన్‌లో తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బిష్కెక్‌కు చేరుకున్నారు.

కిర్గిజిస్థాన్‌ క్యాబినెట్‌ మంత్రుల మండలి చైర్మన్‌ అడిల్‌బెక్‌ కసిమలియేవ్‌ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సంప్రదాయ కిర్గిజ్‌ నృత్య ప్రదర్శనతో భారత ప్రధానిని ఘనంగా ఆహ్వానించారు.

ADVERTISEMENT

వివరాలు 

పలువురు నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

కిర్గిజిస్థాన్‌ అధ్యక్షుడు జపరోవ్‌,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు ఎస్‌సీవోలోని ఇతర సభ్యదేశాల నేతలతోనూ ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, పాకిస్తాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా సదస్సు సందర్భంగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు క్రెమ్లిన్‌ వెల్లడించింది.

ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ADVERTISEMENT