LOADING...
Mojtaba: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. మొజ్తబాకు అధికారం
అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. మొజ్తబాకు అధికారం

Mojtaba: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. మొజ్తబాకు అధికారం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం,దేశ అత్యున్నత మత సంస్థ అయిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తబాను కొత్త సర్వోన్నత నాయకుడిగా ఎన్నుకుంది. 56 ఏళ్ల మొజ్తబా,అలీఖమేనీ రెండో కుమారుడు.చాలా కాలంగా ఆయనే వారసుడిగా వస్తారని చర్చలు సాగుతున్నాయి. అయితే,ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈదాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి నుంచి కుమారుడికి అధికారం మారడంపై ఇరాన్ ప్రకటించిన రాజ్యాంగ సిద్ధాంతాలకు ఇది విరుద్ధం అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

వివరాలు 

ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యంత శక్తివంతమైనది

మరోవైపు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చి మొజ్తబాకు మద్దతు పొందేలా చేసిందని కూడా ఆ కథనం పేర్కొంది. ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యంత శక్తివంతమైనది. దేశ పరిపాలన నుంచి సైన్యం వరకు అన్ని విషయాల్లో తుది నిర్ణయం ఆయనదే. అలాగే సైన్యాధిపతిగా కూడా వ్యవహరిస్తారు. అలీ ఖమేనీ పాలనలో రివల్యూషనరీ గార్డ్ ప్రభావం రాజకీయ, ఆర్థిక రంగాల్లో విస్తరించింది. మొజ్తబాకు ఆ గార్డ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తెర వెనుక కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో సైన్యంలో పనిచేసిన ఆయన, మధ్యస్థ స్థాయి మత గురువుగా కొనసాగుతున్నారు.

Advertisement