
Hamas Captivity: అక్టోబర్ 7 నుంచి హమాస్ చెరలో బందీలుగా వున్న 4గురికి విముక్తి
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ చెరలో బందీలుగా వున్న తమ పౌరులను కాపాడే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ఇజ్రాయెల్ మిలిటరీ వారాంతంలో పగటి పూట చాకచక్యంగా బందీలను విడిపించింది.
విశ్వసనీయ సమాచారంతో గాజాలోని హమాస్ బందిఖానా నుండి నలుగురు బందీలను రక్షించింది.
దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇది నలుగురు బందీలలో ముగ్గురు - అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్ ష్లోమి జివ్ - రక్షించిన క్షణాన్ని చూపుతుంది.
గాజాలో హమాస్ గ్రూపు ముగ్గురిని బందీలుగా ఉంచిన అపార్ట్‌మెంట్‌లోకి ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు , పోలీసులు ప్రవేశించడాన్ని వీడియో చూపిస్తుంది.
వివరాలు
పక్కా వ్యూహంతోనే బందీలకు విముక్తి
బందీలైన నోవా అర్గమణి,అల్మోగ్ మీర్ జాన్,ఆండ్రీ కోజ్లోవ్,ష్లోమి జివ్ లకు విముక్తి లభించింది.
అక్టోబర్ 7న నోవా సంగీత ఉత్సవం నుండి హమాస్ తీవ్రవాదులు వీరిని కిడ్నాప్ చేశారు.నోవా అర్గమణి అనే ఒక ప్రదేశం నుండి రక్షించారు.
అయితే అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్ , ష్లోమి జివ్ వేరే అపార్ట్మెంట్ నుండి సురక్షితంగా కాపాడారు. ఇజ్రాయెల్ డిఫెల్స్ ఫోర్స్ పగటిపూట ఆపరేషన్,"సీడ్స్ ఆఫ్ సమ్మర్","అధిక ప్రమాదకరమైన, సంక్లిష్టమైన మిషన్" అని దాని రంగంలోకి దిగి విజయవంతంగా తమ ఆపరేషన్ ను పూర్తి చేశారని వివరించింది.
"ఖచ్చితమైన ఇంటెలిజెన్స్"ఉపయోగించి బందీలను సురక్షితంగా కాపాడామని IDF ప్రకటించింది.
దీనికి 2వారాలపాటు ప్రణాళిక రూపొంచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.