
వియత్నాం రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మందికి పైగా మృతి
ఈ వార్తాకథనం ఏంటి
వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా మరణించినట్లు, స్థానిక మీడియా నివేదించింది.అగ్నిప్రమాదంలో చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించాయి.
మంగళవారం రాత్రి 11:30 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం)మంటలు చెలరేగినట్లు అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
45 గృహాలు నివసించే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడ్డారని,అది ఇరుకైన సందులో ఉందని ఏజెన్సీ తెలిపింది.
అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచాల్సి వచ్చిందని పేర్కొంది. మృతుల సంఖ్యను అధికారులు ధృవీకరించారని వియత్నాం డాన్ ట్రై వార్తాపత్రిక బుధవారం ఉదయం నివేదించింది.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో అగ్నిప్రమాదం
BREAKING: More than a dozen people are feared dead after a massive fire broke out at an apartment building in Vietnam’s capital, Hanoi, state media said.
— The Associated Press (@AP) September 13, 2023
The fire has been extinguished but rescue operations are continuing. https://t.co/Ne9EXLiAGZ