Page Loader
భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్ 
భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్

భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్ 

వ్రాసిన వారు Stalin
May 16, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వంటకాలు, రుచులకు వేలఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో విదేశాల్లోని ఫుడ్ లవర్స్ భారతీయ వంటకాలకు అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కూడా చేరిపోయాడు. ట్విట్టర్ యూజర్ డేనియల్ బటర్ చికెన్, నాన్, రైస్‌తో చేసిన నోరూరించే వంటకాన్ని మంగళవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తాను బేసిక్‌గా ఇండియన్ ఫుడ్‌ని ప్రేమిస్తానని, ఇది చాలా బాగుందని డేనియల్ రాసుకొచ్చాడు. డేనియల్ ట్వీట్‌కు స్పందించిన ఎలోన్ మస్క్ 'నిజం' అనే ఒక్క పదంతో భారతీయ వంటకంపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. భారతీయ ఆహారాన్ని ప్రశంసించినందుకు చాలామంది మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి వచ్చి భారతీయ వంటలను ట్రై చేయాలని ఆహ్వానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్ చేసిన ట్వీట్