LOADING...
US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం

US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఆదివారం ప్రమాదం తప్పింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో దాని టైరు (Tire) ఊడిపడింది. అయితే, పైలట్ జాగ్రత్తగా, నైపుణ్యంతో వ్యవహరించడంతో ఎవరికి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళితే.. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 206 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఓర్లాండో వైపు బయలుదేరారు.

వివరాలు 

పలు విమానాల ప్రయాణం ఆలస్యం 

విమానం ఓర్లాండో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య వల్ల ముందు టైరు ఊడిపోయి రన్‌వేకు మీద పడింది. ఈ సమయంలో అప్రమత్తమైన పైలట్ వ్యవహరించడంతో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి బయటకు తీయబడ్డారని, ఎవరికి కూడా గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే, విమానాన్ని రన్‌వే నుంచి తొలగించడానికి ప్రత్యేక బృందాలను మోహరించినట్లు FAA అధికారులు తెలిపారు. ఈ కారణంగా కొంతసేపు పలు విమానాల ప్రయాణం ఆలస్యమైందని కూడా తెలిపారు. సాంకేతిక లోపానికి కారణం ఇంకా తెలియలేదని.. ఓర్లాండోలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు తప్పిన ప్రమాదం

Advertisement