LOADING...
US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్.. సురక్షితంగా బయటపడిన  పైలట్ 
కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్35 ఫైటర్ జెట్..సురక్షితంగా బయటపడిన  పైలట్

US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్.. సురక్షితంగా బయటపడిన  పైలట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఒక ఎఫ్-35 యుద్ధవిమానం కుప్పకూలిన సంఘటన కలకలం రేపుతోంది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగి, తీవ్రంగా పొగలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ ప్రాణాపాయంలోంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారిక సమాచారం. ఈ విమానం శిక్షణ విమానంగా ఉపయోగంలో ఉండగా కూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

వివరాలు 

పైలట్‌ను హెలికాప్టర్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలింపు 

ఎఫ్-35 యుద్ధవిమానం ఒక సీటు కలిగిన యుద్ధ విమానం. ఇది సింగిల్ ఇంజన్‌తో నడిచే అత్యాధునిక సాంకేతికత కలిగిన ఫైటర్ జెట్. ఈ యుద్ధవిమానం, సెంట్రల్ కాలిఫోర్నియాలో ఉన్న ఫ్రెస్నో నగరానికి దాదాపు 40 మైళ్లు (సుమారు 64 కిలోమీటర్లు) దూరంలో నైరుతి దిశలో ఉన్న లీమోర్ నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో కూలినట్టు అమెరికన్ నేవీ పేర్కొంది. ప్రాణాపాయంలో ఉన్న పైలట్‌ను హెలికాప్టర్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం ఈ ప్రమాదం సాయంత్రం 6:30 గంటల సమయంలో జరిగిందని, ప్రస్తుతం దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు నేవీ అధికారికంగా తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..