
Pakistan: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులకుకు భారీ ఊరట... అవినీతి కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులకు కు భారీ ఊరట లభించింది.
పాకిస్థాన్ అవినీతి నిరోధక కోర్టు మంగళవారం పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ఇద్దరు కుమారులను మూడు అవినీతి కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.
మాజీ ప్రధాని కుటుంబం ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందులకు దాదాపు ముగింపు పలికింది.
పనామా పేపర్లకు సంబంధించి 2018లో అవెన్‌ఫీల్డ్, ఫ్లాగ్‌షిప్, అల్-అజీజియా అవినీతి కేసుల్లో హసన్ , హుస్సేన్ నవాజ్ ఇద్దరు దోషులు.
2018లో,నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) దాఖలు చేసిన అవెన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్, అల్-అజీజియా, ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులలో విచారణలో చేరడంలో విఫలమైన తర్వాత ఇద్దరు సోదరులను నేరస్థులుగా ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మూడు అవినీతి కేసులలో పాక్ మాజీ ప్రధాని కుమారులకు భారీ ఊరట
Pak Court Acquits Nawaz Sharif's Sons In 3 Corruption Caseshttps://t.co/ZwMkgwbHiZ pic.twitter.com/s6Xue5Uklg
— NDTV (@ndtv) March 19, 2024