Loading...
Nepal: నేపాల్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూపాయి నాణెంలో భారత్‌ భూభాగాల తొలగింపు
నేపాల్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూపాయి నాణెంలో భారత్‌ భూభాగాల తొలగింపు

Nepal: నేపాల్‌ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూపాయి నాణెంలో భారత్‌ భూభాగాల తొలగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రంగా ఉన్న లింపియాధుర, లిపులేఖ్‌, కాలాపానీ ప్రాంతాలను చూపించే మ్యాప్‌ను నేపాల్‌ తన ఒక రూపాయి నాణెం నుంచి తొలగించనుంది. ఈ మ్యాప్‌ స్థానంలో ముస్తాంగ్‌ జిల్లాలోని మరాంగ్‌ గ్రామంలో ఉన్న చారిత్రక లో గ్యాకర్‌ బౌద్ధ మఠం చిత్రాన్ని ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తమ భూభాగంలో భాగమేనని నేపాల్‌ చాలా కాలంగా వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతాలు భారత్‌కు చెందినవేనని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తోంది. ఈ సరిహద్దు వివాదం రెండు దేశాల మధ్య కొనసాగుతూనే ఉంది.

వివరాలు 

వివాదాస్పద మ్యాప్‌ను ఒక రూపాయి నాణెం నుంచి తొలగించాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి 

2020 మేలో అప్పటి ప్రధాని కె.పి. శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్‌ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ అధికారిక మ్యాప్‌లో చేర్చి కొత్త రాజకీయ పటాన్ని విడుదల చేసింది.

అనంతరం అదే మ్యాప్‌ను ఒక రూపాయి నాణెంపై కూడా ముద్రించారు.

ప్రస్తుతం ప్రధానమంత్రి బాలెన్‌ షా నేతృత్వంలోని ప్రభుత్వం ఆ వివాదాస్పద మ్యాప్‌ను ఒక రూపాయి నాణెం నుంచి తొలగించాలని గురువారం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అయితే రెండు రూపాయల నాణెంపై ప్రస్తుతం ఉన్న పాత మ్యాప్‌లో ఎలాంటి మార్పులు ఉండవని కూడా అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లిపులేఖ్‌, కాలాపానీ మ్యాప్‌కు వీడ్కోలు పలుకుతున్న నేపాల్

ADVERTISEMENT