Page Loader
Buddha Air Flight : నేపాల్‌ లో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో మంటలు 

Buddha Air Flight : నేపాల్‌ లో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో మంటలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ఒక విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్లైన్స్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో, విమానాన్ని అత్యవసరంగా కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. సోమవారం ఉదయం, బుద్ధ ఎయిర్లైన్స్‌ విమానం సిబ్బంది మరియు 76 మంది ప్రయాణికులతో కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రాపూర్‌ బయల్దేరింది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కొన్ని నిమిషాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ విషయం పైలట్‌ అనూహ్యంగా గుర్తించి, వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విమానం తిరిగి త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించబడి, అక్కడ సురక్షితంగా ల్యాండ్‌ చేయబడింది.

వివరాలు 

ఇంజిన్‌లో సాంకేతిక సమస్య

ఈ విషయంపై బుద్ధ ఎయిర్లైన్స్‌ స్పందించింది. వారు విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. "ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, విమానాన్ని తిరిగి కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాం. ఉదయం 11:15 గంటలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. మా సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేస్తోంది. ఇక, మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని వారు ఒక ప్రకటనలో తెలిపారు.