
Donald Trump: ట్రంప్ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం .. రెండు ఆస్తులను సీజ్ చేసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.
ఒక చీటింగ్ కేసులో ట్రంప్, అయన ఇద్దరు కుమారులకు న్యూయార్క్ కోర్ట్ గతంలో తీర్పును ఇచ్చింది.
ఆకేసుకు సంబంధించి బాధితులకు 355 మిలియన్ డాలర్లు నగదు, అలాగే దానికి వడ్డీతోసహా మొత్తం 454 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను ట్రంప్ బేఖాతరు చేయడంతో అయన ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్ అటార్నీ జనరల్ చర్యలు చేపట్టారు.
తన ఆస్తుల విలువపై వివిధ బ్యాంక్ లు, భీమా కంపెనీలను ఏళ్ల తరబడి మోసం చేసినట్లు న్యూయార్క్ కోర్ట్ పేర్కొంది.
Details
ఇదే కేసులోట్రంప్ కు 5 మిలియన్ డాలర్ల జరిమానా
కోర్ట్ ఆదేశాల మేరకు ట్రంప్ కు సంబందించి ఉత్తర మాన్‌హట్టన్‌లో గల ప్రైవేటు ఎస్టేట్ సెవన్ స్ప్రింగ్స్, గోల్ఫ్ కోర్సు ను అటార్నీ జనరల్ స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి.
దీనిపై స్పందించిన ట్రంప్ మాట్లాడుతూ... ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
ఇప్పటికే పలు కేసుల్లో అయన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
పరువునష్టం కేసులో అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ జీన్ కరోల్‌కు 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో అంతకుముందు ఆయనకు 5 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించారు.