Page Loader
మద్యం తాగి కారు నడిపిన దేశ మహిళా మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు 
మద్యం తాగి కారు నడిపిన దేశ మహిళా మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

మద్యం తాగి కారు నడిపిన దేశ మహిళా మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 24, 2023
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్​ దేశంలో ఓ మహిళా మంత్రి మద్యం తాగారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకురాలయ్యారు. అనంతరం న్యాయశాఖ మంత్రిగా పదవి కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో సదరు మంత్రి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో అతివేగంగా కారును నడిపారు. ఈ క్రమంలో పార్కింగ్‌లోని వాహనాలను మంత్రి కారు వాయువేగంతో ఢీకొట్టింది. తొలుత మంత్రిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. అనంతరం ఉద్రిక్తతల నడుమ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

DETAILS

మహిళా మంత్రి అలెన్ మానసికంగా బాధపడుతున్నారు : ప్రధాని

మరోవైపు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్‌ హిప్కిన్స్‌ సోమవారం ఉదయం అలెన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్‌ కేసు ఎదుర్కోవడం క్షమించరాదని పేర్కొనడంతో అలెన్‌ రాజీనామా చేశారు. అయితే సదరు మహిళా మంత్రి మానసికంగా బాధపడుతున్నారని, మంత్రిగా విధి నిర్వహణకు ఆమె ఫిట్‌గా లేరని ప్రధాని అన్నారు. ఇటీవలే అలెన్ జీవిత భాగస్వామి నుంచి విడిపోయారు. అప్పట్నుంచి ఆమె తీరు సరిగ్గా ఉండట్లేదని, ఉద్యోగులతోనూ సరిగా ప్రవర్తించడం లేదని తెలుస్తోంది. మంత్రి పదవి పోయినా పార్లమెంట్‌ సభ్యురాలిగా మాత్రం అలెన్ కొనసాగనున్నారు. 39 ఏళ్ల ప్రతిభావంతురాలైన కిరి అలెన్, లేబర్‌ పార్టీలో వేగంగా ఎదిగారు. అక్టోబర్‌ 14న కివీస్ లో ఎన్నికలు జరగనుండటం గమనార్హం.