Page Loader
మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు 
మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పులు

మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 20, 2023
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముంగిట న్యూజిలాండ్ ఉలిక్కిపడింది. ఈ మేరకు మరికొన్ని గంటల్లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో కాల్పుల కలకలం రేగింది. ఘటనలో ఇద్దరు వ్యక్తలు మృతి చెందినట్లు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ ప్రకటించారు. మరో ఆరుగురు గాయపడ్డారని వెల్లడించారు. ఓ దుండగుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి చొరబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.ఘటనలో దుండగుడు సహా ఓ పోలీస్ అధికారి మరణించారు. ఈసారి ఫిఫా టోర్నమెంట్ ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడెన్ పార్క్ వేదికగా కివిస్ తో నార్వే జట్టు తలపడనున్న కొద్ది గంటల ముందే కాల్పుల ఘటనలు భయానికి గురిచేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రపంచ కప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం