వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ
2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. గ్రీన్‌హౌస్ వాయువులు, ఎల్ నినో కలిసి ఉష్ణోగ్రతలను పెంచుతాయి బుధవారం హెచ్చరించింది. 2027 నాటికి ప్రపంచం 1.5C వాతావరణ పరిమితిని అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) పరిశోధన ప్రకారం, కీలకమైన 1.5C థ్రెషోల్డ్‌ను ఉల్లంఘించడం భయంకరమైన పరిణామాలను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది తాత్కాలితమే అని చెబుతున్నారు. అయినప్పటికీ, ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థపై మానవ అవసరాన్ని సూచిస్తుందని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది.
ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువ ఉండకూడదని పారిస్ ఒప్పందంలో నిర్ణయం
2015 పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువ ఉండకూడదని కూటమి దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. 1.5C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు విపత్తతో పాటు కోలుకోలేని ప్రభావాలకు దారి తీస్తాయని డబ్ల్యూఎంఓ చెప్పింది. ఈ నివేదిక ఉద్దేశం పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5Cని శాశ్వతంగా అధిగమించగలమని కాదని, చాలా సంవత్సరాలు భూమి వెడెక్కడాన్ని సూచిస్తుందని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ పెట్టేరి తాలస్ తెలిపారు. ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ 1.5C థ్రెషోల్డ్‌ను అతిక్రమించలేదని పేర్కొన్నారు. 2023 -2027 మధ్య కనీసం ఒక సంవత్సరంలో 1.5C థ్రెషోల్డ్‌ను అధిగమించే అవకాశం 66శాతం ఉందని నివేదిక పేర్కొంది.
ఎల్ నినో అభివృద్ధి చెందిన ఏడాదిలోనే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి నిర్వహణ, పర్యావరణంపై ఉంటుందని, దీనికి అందరం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూఎంఓ పేర్కొంది. ఎల్ నినో అభివృద్ధి చెందే అవకాశాలు ఈ ఏడాది జూలై చివరి నాటికి 60 శాతం, సెప్టెంబర్ చివరి నాటికి 80 శాతంగా ఉంటాయని డబ్ల్యూఎంఓ ఈ నెల ప్రారంభంలో పేర్కొంది. సాధారణంగా, ఎల్ నినో అభివృద్ధి చెందిన తర్వాత సంవత్సరంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంటే 2024 నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రీన్‌హౌస్ వాయువులుగా పిలవబడే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణంలో వేడి చిక్కుకుపోతుంది. దీని వల్ల ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతాయి.