Page Loader
Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్' 
Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్'

Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్' 

వ్రాసిన వారు Stalin
Nov 19, 2023
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఏడాదికి గానూ విశ్వ సుందరిని ప్రకటించారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను 72వ మిస్ యూనివర్స్ విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. ఎల్ సాల్వడార్‌లోని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో గ్రాండ్ వేడుక జరిగింది. 2022లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకున్న అమెరికాకు చెందిన ఆర్ బోనిక్ గార్బియెల్ నుంచి 'మిస్ యూనివర్స్-2023' కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్‌ అందుకుంది. షెన్నిస్ పలాసియోస్‌కు ఈ కిరీటం చాలా ప్రత్యేకమైనది. మిస్ యూనివర్స్ గెలుచుకున్న మొదటి నికరాగ్వా మహిళ ఈమే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మిస్

టాప్ 10లో భారత్‌కు దక్కని ప్రాతినిధ్యం

మిస్ యూనివర్స్ 2023లో షెన్నిస్ పలాసియోస్ కాకుండా మరో ఇద్దరు మగువలు కూడా అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలవగా, థాయిలాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీల్లో భారత్‌ టాప్ 10లో చోటు దక్కలేదు. చండీగఢ్‌లో జన్మించిన శ్వేతా శారదా మిస్ యూనివర్స్ 2023లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె టాప్- 20లోకి వచ్చింది. ఆ టాప్ -10లోకి రాలేకపోయింది. ఈ ఏడాది పాకిస్థాన్ తొలిసారి మిస్ యూనివర్స్‌లో అడుగుపెట్టింది. ఈ సంవత్సరం 72వ మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో 84 దేశాల నుంచి అందాల భామలు పోటీ పడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మిస్ యూనివర్స్ ట్వీట్